సిలబస్‌ తగ్గించిన సీబీఎస్‌ఈ

సిలబస్‌ తగ్గించిన సీబీఎస్‌ఈ
  • ఎన్‌సీఈఆర్టీ అకడమిక్‌ క్యాలెండర్‌‌లో మార్పులు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌పై బాగా ఎఫెక్ట్‌ చూపించింది. ఇప్పటికే జరగాల్సిన ఫైనల్‌ ఎగ్జామ్‌ పోస్ట్‌ పోన్‌ అయ్యాయి. అకడమిక్‌ ఇయర్‌‌ ప్రకారం స్టార్ట్‌ అవ్వాల్సిన సిలబస్‌ ముందుకు సాగలేదు. దీంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌లో మార్పులు చేసింది. 9 – 12 తరగతుల వారికి 2020 – 21 అకడమిక్‌ ఇయర్‌‌ సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌సీఈఆర్టీ అకడమిక్‌ క్యాలెండర్‌‌లో మార్పులు చేయడంతో దానికి అనుగుణంగా సిలబస్‌ తగ్గించామని సీబీఎస్‌ఈ అధికారులు చెప్పారు. అకడమిక్‌ క్యాలెండర్లలో మార్పులు చేయాలని హ్యూమన్‌ రిసోర్స్‌ డవలప్‌మెంట్‌ మినిస్ట్రీ ఆదేశాల మేరకు ఎన్‌సీఈఆర్టీ, ఎన్‌టీఏ అకడమిక్‌ క్యాలెండర్‌‌లో మార్పులు తెచ్చింది. సెలవుల్లో స్టూడెంట్స్‌ ఇంట్లోనే పేరెంట్స్‌ హెల్ప్‌తో చేసేలా యాక్టివిటీలు ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. పిల్లల టైం వేస్ట్‌ కాకుండా, వాళ్లు డ్రప్రెషన్‌లోకి వెళ్లకుండా ఉపయోగపడే టాస్క్‌లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అకడమిక్‌ క్లాసులు నడిపేందుకు సిలబస్‌ నుంచి ఈ ఏడాది చాలా యాక్టివిటీలు తొలగించామని సీబీఎస్‌ఈ అధికారులు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీనియర్‌‌ టీచర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త సిలబస్‌కు సంబంధించి పీడీఎఫ్‌లు అఫీషియల్‌ సైట్‌లో ఉంచామన్నారు. కరోనాను అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది. దీంతో ఎగ్జామ్స్‌ కూడా వాయిదా పడ్డాయి. కాగా.. కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌ ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తున్నాయి. అంతే కాకుండా సమ్మర్‌‌ వెకేషన్‌ను తగ్గించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వెబ్‌సైట్‌: http://cbseacademic.nic.in/curriculum_2021.html