జీఎస్‌‌టీలో మార్పులు 

జీఎస్‌‌టీలో మార్పులు 

న్యూఢిల్లీ: జీఎస్‌‌టీలో మార్పులు, చేర్పులు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫుట్‌‌వేర్‌‌‌‌, టెక్స్‌‌టైల్‌‌ సెక్టార్స్‌‌పై జీఎస్‌‌టీని ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఫుట్‌‌వేర్స్‌‌పై 12 శాతం జీఎస్‌‌టీని, కాటన్‌‌ మినహా అన్ని రకాల రెడీమేడ్‌‌ గార్మెంట్స్‌‌పై 12 శాతం జీఎస్‌‌టీని జనవరి 1 నుంచి వసూలు చేస్తారు. ఆటో రిక్షాలు, క్యాబ్‌‌లు వంటివి ఆన్‌‌లైన్ ద్వారా సర్వీస్‌‌లను అందిస్తే 5 శాతం  జీఎస్‌‌టీని కట్టాల్సిందే. తమ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా జరిగే రెస్టారెంట్ సర్వీస్‌‌లపై జీఎస్‌‌టీని వసూలు చేసే బాధ్యత ఇక నుంచి కంపెనీలదే. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలే జీఎస్‌టీని వసూలు చేసి, గవర్నమెంట్‌‌కు డిపాజిట్ చేయాలి. అలానే ఇటువంటి సర్వీసులకు  ఇన్‌‌వాయిస్‌‌లను కూడా ఇష్యూ చేయాలి. ఈ మార్పు అమల్లోకి వస్తే కస్టమర్లపై రెస్టారెంట్లు ఇక జీఎస్‌‌టీని వసూలు చేయవు. వీటితో పాటు జీఎస్‌‌టీ రీఫండ్‌‌ క్లెయిమ్ చేయడానికి ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి కావడం, బిజినెస్‌‌లు ట్యాక్స్ కట్టకపోయినా లేదా జీఎస్‌‌టీఆర్‌‌‌‌–3బీ ఫామ్‌‌ను సబ్మిట్ చేయకపోయినా జీఎస్‌‌టీఆర్‌‌‌‌–1 ఫైలింగ్‌‌ను బ్లాక్ చేయడం వంటివి వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయి.