పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు

పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి ఆయిల్ కంపెనీలు. ఐతే ఈసారి పెట్రోల్ ధరను పెంచి..డీజిల్ ధరను మాత్రం కాస్త తగ్గించాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు పెంచిన ఆయిల్ కంపెనీలు డీజిల్ పై 17 పైసలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 19 పైసలకు చేరగా...డీజిల్ ధర 89 రూపాయల 72 పైసలుగా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల 20 పైసలు, లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 29 పైసలుగా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 53 పైసలుగా ఉంది. డీజిల్ ధర 98 రూపాయల 50 పైసలుగా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 35 పైసలు, డీజిల్ ధర 92 రూపాయల 81 పైసలుగా ఉంది. మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటగా....డీజిల్ కూడా సెంచరీకి చేరువవుతోంది. దాదాపు 15కు పైగా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర వంద దాటింది.