కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పులు.. ఇకపై వాళ్లకూ సిటిజన్‌‌షిప్

కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పులు.. ఇకపై వాళ్లకూ సిటిజన్‌‌షిప్

ఒట్టావా: పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసేందుకు కెనడా సిద్ధమైంది. ఇందుకోసం బిల్లు సీ3ని తీసుకొచ్చింది. దీనికి ఇప్పటికే ప్రెసిడెంట్ ఆమోదం కూడా లభించింది. కెనడా సర్కార్‌‌‌‌ ఫస్ట్ జనరేషన్ లిమిట్ పేరుతో 2009లో తెచ్చిన రూల్ ప్రకారం.. విదేశాల్లో పుట్టిన/దత్తత తీసుకున్న పిల్లలకు సిటిజన్ షిప్ రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడాలో పుట్టి ఉండాలి. లేదా సిటిజన్‌‌షిప్ అయినా పొంది ఉండాలి. 

అయితే ఈ రూల్‌‌ను వ్యతిరేకిస్తూ గత కొన్నేండ్లుగా ఉద్యమం జరుగుతున్నది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని కోర్టు కూడా తేల్చిచెప్పింది. దీంతో కెనడా సర్కార్ కొత్త బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రకారం.. విదేశాల్లో పుట్టిన తమ పిల్లలకు కెనడా సిటిజన్‌‌షిప్ రావాలంటే, పిల్లలు పుట్టడానికి ముందు తల్లిదండ్రులు కనీసం 1,095 రోజులు కెనడాలో నివసించి ఉండాలి. విదేశాల్లో పిల్లలను దత్తత తీసుకునే పేరెంట్స్‌‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.