ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై అలర్ట్ అయ్యాయి. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఈ వైరస్ ను నిర్మూలించేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఏమేం చేస్తే మంచిదన్నా దానిపై ఫోకస్ చేస్తుంది.
మానవ ప్రయత్నంతో పాటు.. కంటికి కనిపించని శక్తి ఏదో కాపాడుతుందన్న నమ్మకంతో కొందరు చైనీయులు.. కరోనా వైరస్ నుంచి కాపాడాలని ఆధ్యాత్మిక గురువు దలైలామాను కోరుకుంటున్నారు. దీనికి దలైలామా స్పందిస్తూ కరోనాకు చెక్ పెట్టేందుకు తారా మంత్రాన్ని జపించాలని సూచించారు.
‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ తన గొంతు ఉన్న ఆడియో క్లిప్ ను కూడా పోస్టు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనానుంచి బయటపడేందుకు ప్రజలు దలైలామా మంత్రాన్ని పెద్ద ఎత్తున జపిస్తున్నారు. ఇప్పుడీ మంత్రం చైనాలో వైరల్ గా మారింది. మరీ.. మంత్రం కరోనాను ఎంతమేర కంట్రోల్ చేస్తుందన్నది కాలమే బదులివ్వాలి.
