చార్ ధామ్ యాత్ర షురూ .. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి

చార్ ధామ్ యాత్ర షురూ .. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి

డెహ్రాడూన్: ప్రఖ్యాత చార్ ధామ్ యాత్ర బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న గంగోత్రి తలుపులను ఉదయం10.30 గంటలకు, యమునోత్రి తలుపులను 11.30 గంటలకు ఆచార, సాంప్రదాయాల మధ్య తెరిచారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రెండు ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన యమునోత్రిలో మీడియాతో మాట్లాడారు.

 ‘‘మేం  ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు చివరకు వచ్చింది. చార్ ధామ్ యాత్ర మాకు పెద్ద పండుగ. యాత్రికుల భద్రత మా ప్రాధాన్యత” అని ఆయన తెలిపారు. కేదార్ నాథ్ యాత్ర మే2న, బద్రినాథ్ యాత్ర మే 4న ప్రారంభమవుతుంది. పహల్గాం అటాక్ నేపథ్యంలో పుణ్యక్షేత్రాల వద్ద దాదాపు 6వేల మంది పోలీసులు, 10 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.