
ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న రామ్ చరణ్‌కు.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో నిర్వహించే ‘పాప్ గోల్డెన్ అవార్డ్స్’లో చరణ్ ‘గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్’ అవార్డును గెలుచుకున్నాడు. పాప్ గోల్డెన్ కమిటీ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది.
ఈ అవార్డుల నామినేషన్స్‌లో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, అర్జున్ మాథుర్, అదాశర్మ, రాశీఖన్నా, రిద్ధి డోగ్రా పోటీపడ్డారు. వారందరిని వెనక్కి నెట్టి చరణ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్‌తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నాడు.