ఆప్ దెబ్బకు ఓడిన ప్రముఖులు

ఆప్ దెబ్బకు ఓడిన ప్రముఖులు

అమృత్ సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆప్ దెబ్బకు బడా బడా నేతలంతా ఓటమి పాలయ్యారు. అధికార కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగలింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ ఘోర పరాభవాన్ని చవి చూశారు. ఆయన పోటీ చేసిన బదౌర్ స్థానంలో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ చేతిలో 34వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చమ్కూర్ సాహిబ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి చరణ్జీత్ సింగ్ కాంగ్రెస్ 5,500 ఓట్ల మెజార్టీతో సీఎం చన్నీని ఓడించారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు సైతం పరాభవం తప్పలేదు. అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయనపై ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ 6,750 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.మోగా స్థానం నుంచి బరిలో నిలిచిన సోనూ సూద్ సోదరి మాళవికను ఆమ్ ఆద్మీ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా ఓడించారు. 

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమి పాలయ్యారు. పటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ను ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ 11వేల ఓట్ల తేడాతో ఓడించగా.. జలాలాబాద్ నుంచి పోటీ చేసిన సుఖ్బీర్ సింగ్ను 16వేల ఓట్ల తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత జగ్దీప్ కంబోజ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తల కోసం..

గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

సూర్య ఈటీ మూవీ రివ్యూ