చర్లపల్లి రైల్వే స్టేషన్ మృతదేహం ఘటనలో షాకింగ్ విషయాలు..

చర్లపల్లి రైల్వే స్టేషన్ మృతదేహం ఘటనలో షాకింగ్ విషయాలు..

గురువారం ( సెప్టెంబర్ 18 ) చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు గోనె సంచిలో మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో పడేసిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న చర్లపల్లి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) ఉదయం 11: 45 గంటలకు మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి పడేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇవ్వాళ రైల్వే స్టేషన్ సమీపంలో మూటను గుర్తించారు స్థానిక ఆటో డ్రైవర్లు. శుక్రవారం బీహార్ వెళ్లే రైలు కోసం చర్లపల్లి స్టేషన్ కు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు. 

ట్రైన్ ఆలస్యంగా రావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకూ అదే రైలు కోసం వేచి చూసారు ప్రయాణికులు. ప్రయాణికులు ఎక్కువ ఉండటంతో మృతదేహం ఉన్న మూటను గుర్తించలేకపోయారు రైల్వే సిబ్బంది.ఇవ్వాళ ప్రయాణికులు వెళ్ళిపోవడంతో మూట గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆటో డ్రైవర్లు.