చార్లెస్ ఎంటర్ ప్రైజెస్...డీసెంట్ కామెడీ

 చార్లెస్ ఎంటర్ ప్రైజెస్...డీసెంట్ కామెడీ

జీవితంలో సొంత వ్యాపారం పెట్టాలనేది రవి కుట్టి (బాలు వర్గీస్) కల. కొచ్చికి చెందిన రవి తన తల్లి గోమతి (ఊర్వశి)తో కలిసి ఉంటున్నాడు. ఆమె దగ్గర ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. దాన్ని చోళులు తమ ముత్తాతలకు బహుమతిగా ఇచ్చారని దాన్ని భద్రంగా దాస్తుంది. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న ఒక మహిళ, రవితో ఒక డీల్ మాట్లాడుకుంటుంది. ‘గోమతి దగ్గరున్న విగ్రహం తీసుకొచ్చి తనకు ఇస్తే, చాలా డబ్బు ఇస్తాన’ని చెప్తుంది. అది విన్న రవి, ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టొచ్చని ఆశపడతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్​! రవి ఆ విగ్రహాన్ని దొంగతనంగా తీసుకెళ్లాలి. కానీ, చీకటిపడితే అతనికి కనిపించదు. రేచీకటితో బాధపడుతుంటాడు. మరి అలాంటి వ్యక్తి ఎలా దొంగిలిస్తాడా? అనుకుంటుండగా కథలోకి మరో చిన్న దొంగ ఎంట్రీ ఇస్తాడు. అతడే చార్లెస్ (కలైయారసన్). ఇద్దరూ కలిసి దొంగతనం చేయాలనుకుంటారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

టైటిల్: చార్లెస్ ఎంటర్ ప్రైజెస్
డైరెక్షన్: సుభాష్ లలితా సుబ్రమణ్యం
కాస్ట్ : ఊర్వశి, కలైయారసన్, గురు సోమసుందరం, బాసి జోసఫ్, బాలు వర్గీస్
లాంగ్వేజ్: మలయాళం
ఫ్లాట్ ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో