వాట్సాప్​ చాట్​లకు ‘చాట్ జీపీటీ’ రిప్లై

వాట్సాప్​ చాట్​లకు ‘చాట్ జీపీటీ’ రిప్లై

వాషింగ్టన్​ : మీరు బిజీగా ఉన్నారా ?  వాట్సాప్​ చాటింగ్​ చేసే తీరిక లేదా ? టెక్స్ట్​మెసేజ్ లు టైప్​ చేసే టైం లేదా ? అయితే మీ తరఫున చాటింగ్​ చేసేందుకు చాట్​ జీపీటీ రెడీ అయ్యింది.  అచ్చం మీ స్టైల్​లోనే వాట్సాప్ చాట్ లకు​ రిప్లైలు ఇచ్చేందుకు టెక్​ సరంజామా సిద్ధం చేసుకుంది. వాట్సాప్​ అధికారికంగా చాట్​ జీపీటీకి సంబంధించిన ట్యాబ్​ను ఇంకా అందుబాటులోకి తేలేదు. అయితే వాట్సాప్​ను చాట్​ జీపీటీతో ఇంటిగ్రేట్​చేసే  పైథాన్ స్క్రిప్ట్​ను డానియెల్​ గ్రాస్​ అనే డెవలపర్​ మైక్రోసాఫ్ట్​ గిట్ హబ్​ ప్లాట్​ఫామ్​పై రాశాడు.  దానికి ‘వాట్సాప్​జీపీటీ’ అని పేరు పెట్టాడు.   దానికి సంబంధించిన లింక్​ (https://github.com/danielgross/whatsapp–-gpt)పై  క్లిక్​ చేసి మైక్రోసాఫ్ట్​కు చెందిన గిట్​హబ్​ ప్లాట్​ఫామ్​ద్వారా మన వాట్సాప్​తో చాట్​ జీపీటీని లింక్​ చేసుకోవచ్చు.  

ఈ ఫైల్ ను ఓపెన్​ చేయగానే ‘server.py’  ఫైల్​ను ఎగ్జిక్యూట్​ చేయాలి.  తొలుత సర్వర్​ నడుస్తున్న సమయంలో ‘is’ అని టైప్​ చేసి ఎంటర్​బటన్​ నొక్కాలి. ఆ తర్వాత ‘python server.py’ ఫైల్​పై క్లిక్​ చేయగానే ఆటోమెటిక్​గా మీ వాట్సాప్​ నంబర్​తో చాట్​ జీపీటీ కాన్ఫిగరేషన్ పూర్తవుతుంది. చివరగా ‘వెరిఫై ఐయామ్​ ఎ హ్యూమన్’ అనే బాక్స్​ వస్తుంది. దానిపై క్లిక్​ చేసి మీరు మనిషే అని ధ్రువీకరిస్తే ప్రాసెస్​ కంప్లీట్​ అవుతుంది. అయితే ఈ పైథాన్ స్క్రిప్ట్ ను వినియోగించేందుకు వీలుగా మీ ఫోన్​లో లాంగ్వేజ్​ లైబ్రరీని డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.