చాట్జీపీటీ సేవలకు అంతరాయం

చాట్జీపీటీ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ: ఓపెన్​ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ చాట్​జీపీటీ సేవలు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా కొంతసేపు నిలిచిపోయాయి. ఎన్నో దేశాల్లో వేలాది మంది ఈ ప్లాట్​ఫారాన్ని ఉపయోగించుకోలేకపోయారు. మనదేశంతోపాటు యూఎస్​లో చాట్​జీపీటీ పనిచేయలేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. 

రియల్-టైమ్ మానిటరింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెటెక్టర్ ప్రకారం, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మనదేశంలోనే 800 ఫిర్యాదులు లాగిన్ అయ్యాయి.  చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ ప్రశ్నలకు ప్రతిస్పందించలేదని,  మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పనిచేయలేదని ఫిర్యాదులు చేశారు. కొంత మంది ఏపీఐ -సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.