షాపింగ్ లవర్స్‌కి AI స్పెషల్.. ఈకామర్స్ షాపింగ్ కోసం ChatGPT రీసెర్చ్ టూల్

షాపింగ్ లవర్స్‌కి AI స్పెషల్.. ఈకామర్స్ షాపింగ్ కోసం ChatGPT రీసెర్చ్ టూల్

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఇటీవల "షాపింగ్ రీసెర్చ్" అనే కొత్త టూల్‌ను ప్రకటించింది. ఇది చాట్‌జీపీటీ వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించిన, విశ్లేషణాత్మకమైన షాపింగ్ గైడ్‌ తయారుచేసే సాంకేతికత. ఈ టూల్ వినియోగదారుల బడ్జెట్, కావలసిన ఫీచర్లు, వస్తువు ఎవరికి కావాలో వంటి వివిధ అంశాల ఆధారంగా పర్సనల్ షాపింగ్ సూచనలను అందిస్తుంది. వినియోగదారులు ప్రశ్నలు అడుగగానే ఈ టూల్ ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతుంది.

షాపింగ్ ఫీచర్ OpenAI GPT-5 మినీ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది నమ్మదగిన రిటైల్ వెబ్‌సైట్లు, వినియోగదారుల రివ్యూ లను సమగ్రపరచి సరైన ఉత్పత్తి సమాచారాన్ని అందిస్తుంది. వినియోగదారులతో క్విజ్ రూపంలో ఇంటరాక్టివ్‌గా ప్రశ్నలు అడిగి వారి అవసరాలను అధిగమించి వాటికి సరిపోయే 10-15 బెస్ట్ ఆప్షన్స్ చూపిస్తుంది. భవిష్యత్తులో ఈ షాపింగ్ రీసెర్చ్ టూల్‌తో ఇన్‌స్టాంట్ చెకౌట్ ద్వారా కస్టమర్లు చాట్‌జీపీటీతోనే షాపింగ్  కూడా పూర్తి చేయగలుగుతారు.

Also read:- ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైంది: Apple, Samsung, Vivo ఫోన్‌లపై బంపర్ ఆఫర్లు!

​OpenAI ఈ టూల్‌ను చాట్‌జీపీటీ ఫ్రీ, గో, ప్లస్, ప్రో సేవల్లో లాగినైన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వినియోగదారుల ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలను ఇవ్వగలదు. ఇది కస్టమర్లకు సరైన వస్తువు ఎంపిక చేసుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది.​