భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. కూంబింగ్‌కు వచ్చే భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకొని చోటే డోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోయమేటపడ్– బేరా గ్రామాల మధ్య మావోయిస్ట్‌లు మూడు కుక్కర్ బాంబులు అమర్చారు.
ఈ విషయం తెలుసుకున్న, ఓర్చా పోలీస్‌స్టేషన్‌కు చెందిన బాంబ్ స్క్వాడ్ టీం, ఐటీబీపీ డాగ్ స్క్వాడ్, చోటే డోంగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి బాంబులను వెలికితీశారు. అనంతరం మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్నారు.
