ఈ ఎయిర్​ ప్యూరిఫయర్ తో నాలుగు సమస్యలకు చెక్​​

ఈ ఎయిర్​ ప్యూరిఫయర్ తో నాలుగు సమస్యలకు చెక్​​

‘‘డైనమిక్​ యంగ్​ ఎంట్ర​ప్రెన్యూర్,​ క్రిష్​ చావ్లాను కలవడం చాలా హ్యాపీగా ఉంది. అతడు తయారుచేసిన ‘బ్రీతి ఫై’ ఎయిర్​ఫ్యూరిఫయర్​ ‘మేకిన్​ ఇండియా’లో భాగం. కంగ్రాట్స్​ క్రిష్​.”అని నీతీ ఆయోగ్​ సీఈవో అమితాబ్​ కాంత్​ ట్వీట్​ చేశాడు. అనుభవాన్ని మించిన టీచర్​ ఉండరంటారు. చిన్నతనంలో ఉన్న ఆరోగ్య సమస్య ఇప్పుడు ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల ని ఇన్నొవేటర్​ను చేసింది. తక్కువ ధరలో ప్లాస్టిక్​ ఫ్రీ ఎయిర్​ ప్యూరిఫయర్​ తయారు చేసి, అందరి చేత శెభాష్​ అనిపించుకున్నాడు. అంతేకాకుండా నీతీ ఆయోగ్​ సీఈవో అమితాబ్​ కాంత్​ ప్రశంసలూ పొందాడు. 
గాలిలో కాలుష్యం పెరిగితే శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు పడే ఇబ్బంది అంతాఇంతా కాదు. అలాంటి వాళ్లకు ఎయిర్​ప్యూరిఫయర్​ అవసరం చాలా ఎక్కువ. కానీ మార్కెట్​లో ఒక్కో ఎయిర్​ ప్యూరిఫయర్​ దాదాపు ముప్ఫయి వేల పైనే. క్రిష్​ చావ్లా తయారుచేసిన ‘బ్రీతి ఫై’ ఎయిర్​ప్యూరిఫయర్​ అలాంటి వాళ్లకు ఎంతో పనికొస్తుంది.


‘‘నేను చిన్నప్పుడు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడ్డాను. నా చుట్టూ ఎయిర్​ ప్యూరిఫయర్స్​ ఉండేవి. ఆ ఎయిర్​ ప్యూరిఫయర్స్​ ఎలా పనిచేస్తాయో, వాటిలోపల ఏ భాగాలు ఉంటాయో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. వెంటనే ఒక ఎయిర్​ ప్యూరిఫయర్​ తెరిచి చూశాను. ఆ మెషిన్​ చాలా సింపుల్​గా ఉంది. అంత సింపుల్​ మెషిన్​ని  35 వేల నుంచి 40 వేల రూపాయలకు అమ్మడం చూసి ఆశ్చర్యపోయాను. ​శ్వాస సంబంధ సమస్యలు ఉన్న పేదవాళ్లు అన్ని పైసలు పెట్టి వాటిని​ కొనలేరనిపించింది. అందుకే అలాంటి వాళ్లకు అందుబాటు ధరలో మూడు, నాలుగు వేలలో ఎయిర్​ప్యూరిఫయర్​ తయారుచేయాలనుకున్నా” అని తన ఎక్స్​పీరియెన్స్​ చెప్పాడు క్రిష్​ చావ్లా. 
నాలుగు సమస్యలకు చెక్​
మార్కెట్​లో దొరికే ఎయిర్​ ప్యూరిఫయర్స్​లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలు ఉన్నాయంటాడు క్రిష్. అవేమిటంటే...  బాగా పనిచేయవు. ఎకోఫ్రెండ్లీ కావు. వాటిలోని హెపా (హై ఎఫీషియెన్సీ పార్టిక్యులేట్​ ఎయిర్​)ఫిల్టర్​ క్వాలిటీ తక్కువ. వాటి ధర చాలా ఎక్కువ.  ఈ  నాలుగు సమస్యలు లేని ఎయిర్​ప్యూరిఫయర్​ తయారుచేయాలి అనుకున్నాడు క్రిష్​. 98శాతం ప్లాస్టిక్​ ఫ్రీ విడి భాగాలతో ఎయిర్​ ప్యూరిఫయర్​ రెడీ చేశాడు. అందుకోసం పూర్తిగా మనదేశంలో దొరికే విడి భాగాలనే వాడాడు. అలా ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్​గా పనిచేసే, తక్కువ ధరకు దొరికే ‘బ్రీతి ఫై’ ఎయిర్​ ప్యూరిఫయర్​ డిజైన్​ చేశాడు. నాలుగు మోడళ్లలో దొరికే వీటి ధర రెండు వేల నుంచి 4,500 రూపాయలు.
సేవా సంస్థలకు ఫ్రీ
ఈ ఎయిర్​ ప్యూరిఫయర్​ 25‌‌–65 వాట్ కరెంట్​ను మాత్రమే వాడుకుంటుంది. అయితే ‘హెపా’ ఫిల్టర్​ను మార్చాల్సి ఉంటుందంతే. అన్ని విధాలా బెటర్​గా ఉన్న ‘బ్రీతి ఫై’ ఎయిర్​ ప్యూరిఫయర్స్​ అందరికీ బాగా నచ్చాయి. దాంతో వీటిని ఇప్పటి వరకు 4,700ల మంది కొన్నారు. ఓల్డేజ్​ హోమ్, హాస్పిటల్స్, అనాథాశ్రమాలకు 500 ‘బ్రీతి ఫై’ ఎయిర్​ ప్యూరిఫయర్స్​ను ఉచితంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు క్రిష్​.  అలాంటి సంస్థలకు మరో 2,000 ఎయిర్​ ప్యూరిఫయర్స్​ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాడు ఈ టీనేజర్​.