పెట్టుబడి పెడితే షేర్ ఇస్తామని... రూ.35 లక్షలు ముంచారు

పెట్టుబడి పెడితే షేర్ ఇస్తామని... రూ.35 లక్షలు ముంచారు

 బషీర్​బాగ్​, వెలుగు: తమ వద్ద పెట్టుబడి పెడితే వచ్చే లాభాల్లో వాటా ఉంటుందని నమ్మించి ఓ వ్యక్తి వద్ద ఆన్​లైన్​ స్కామర్లు రూ.35 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన మేరకు.. ముషీరాబాద్ కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి వాట్సాప్ కు జులై 21న రెంట్​/స్టెడీ లీజ్​ ప్రతినిధుల పేరుతో మెసేజ్​ వచ్చింది. 

తమ రెంటల్ ప్రాపర్టీస్ వివరాలను పోస్ట్ చేస్తే కమీషన్, ఇన్వెస్ట్​మెంట్ చేస్తే షేర్  ఇస్తామని నమ్మించారు. రూ.10 వేలు డిపాజిట్​ చేస్తే రూ.10,748 రిటర్న్ చేశారు. రూ.31,259 డిపాజిట్ చేస్తే మరింత లాభం ఇచ్చారు. దీంతో వారిని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.35,26,677 ఇన్వెస్ట్ చేశాడు. ఆ తరువాత స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.