జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి, ఎమ్మెల్యేల హస్తం

జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి, ఎమ్మెల్యేల హస్తం
  • ఈ మోసంలో మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హస్తం ఉంది
  • వసూలు చేసిన డబ్బును బాధితులకు జనవరి 31లోగా తిరిగివ్వాలి
  • లేకపోతే వసూళ్ల చిట్టా బయటపెడతా
  • ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ సంచలన ప్రకటన

హైదరాబాద్: రామగుండం ఎరువుల ఫ్యాకర్టీలో జాబ్స్ ఇప్పిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడు, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ అనుచరుడు మోహన్ గౌడ్ 30కోట్లకు పైగా వసూల్ చేశారని ఆరోపించారు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావ. ఈ మోసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే హస్తం ఉందన్నారు. ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 8 లక్షల వసూలు చేశారని మీడియా సమావేశంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం 370 నుంచి 400 మంది దగ్గరి నుంచి 20 నుంచి 30 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే చందర్ లు టీఆర్ఎస్ నాయకుడిగా చెలామణి అవుతున్న మోహన్ గౌడ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు పాల్పడినందున ఈ విషయంలో వారు బాధ్యత తీసుకోవాలని గోనె ప్రకాశ్ రావు పేర్కొన్నారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇతర సంపాదనలు, రియల్ ఎస్టేట్, ఇతర  ఆదాయాల గురించి తాను మాట్లాడడం లేదని.. కేవలం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి వసూలు చేసిన డబ్బునే బాధితులకు తిరిగి చెల్లించాలని కోరుతున్నానని గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. జనవరి 31లోపు బాధితులందరికి తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే జనవరి 31వ తేదీ తర్వాత చిట్టా బయటపెడతానని ఆయన హెచ్చరించారు. 

FOR MORE NEWS:

ఐటీ అధికారుల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

సర్పంచ్ పదవికి వేలం పాట

పంటకు నిప్పు పెట్టిన రైతన్న

కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రమే కట్టుకుంటోంది