ఐటీ అధికారుల పేరుతో దోపిడీ చేసిన ముఠా అరెస్ట్

ఐటీ అధికారుల పేరుతో దోపిడీ చేసిన ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఐటీ అధికారుల పేరుతో దోపిడీకి పాల్పడిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 మంది ముఠా కలిసి దొంగతనం చేసినట్లు గుర్తించారు. చోరీకి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. మరో నలుగురు పరారీలో ఉన్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

బంగారం, మొబైల్ ఫోన్లు కలిపి మొత్తం కోటి 25 లక్షల వస్తువులను సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఐటీ అధికారులమంటూ... రియల్ ఎస్టేట్ వ్యాపారి సుబ్రమణ్యం ఇంట్లో   కిలో 276 గ్రాముల బంగారాన్ని దోపీడీ చేశారని వివరించారు. ప్రధాన నిందితుడు సంవత్సరం క్రితం సుబ్రహ్మణ్యం దగ్గర పని చేశాడని పోలీసులు చెబుతున్నారు. పక్కా స్కెచ్ ప్రకారం దోపిడీ చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

 

FOR MORE NEWS:

తెలంగాణలో ‘పుష్ఫ’ 5 ఆటలకు అనుమతి

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

సర్పంచ్ పదవికి వేలం పాట

కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రమే కట్టుకుంటోంది