లక్కీ డ్రా పేరుతో చీటింగ్  

లక్కీ డ్రా పేరుతో చీటింగ్  
  • 12 కిలోల వెండి, 100 ఎల్ఈడీ టీవీలు స్వాధీనం

నేరెడ్​మెట్, వెలుగు: లక్కీ డ్రా పేరుతో 3వేల మందిని మోసం చేసిన ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. రూ. 25 లక్షల విలువైన12 కిలోల సిల్వర్​ కాయిన్స్, 100 ఎల్ఈడీ టీవీలు, 5సెల్​ఫోన్లు, లక్కీడ్రా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈసీఐఎల్​కు చెందిన షేక్​ సలావుద్దీన్(38), సాహెబ్ మీర్​ఖాన్(43) ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి 2020లో మీర్​పేట హెచ్ బీ కాలనీలో ఫేక్​ రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​తో నైస్ ఎంటర్ ప్రైజెస్​ పేరుతో కంపెనీ స్టార్ట్​ చేశారు. లక్కీడ్రా స్కీం పేరుతో నెలకు వెయ్యి చొప్పున కడితే ఏదో ఒక గిఫ్ట్ ​కచ్చితంగా వస్తుందని జనాన్ని నమ్మించారు. 3 వేల మంది నుంచి 16 నెలలపాటు రూ.4.8కోట్లు వసూలు చేశారు. తర్వాత తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో మల్కాజిగిరి ఎస్ ఓటీ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.