బీన్స్ తో డయబెటిస్ కు చెక్

బీన్స్ తో డయబెటిస్ కు చెక్

మీరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? క్రమం తప్పకుండా బీన్స్​ తీసుకుంటే డయాబెటిస్ ను దూరం చేసుకోవచ్చట. టైప్ –2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్​ తీసుకుంటే షుగర్ లెవల్స్​ తగ్గుతా యని పలు పరిశోధనల్లో కూడా తేలింది. బీన్స్​తో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ పొందొచ్చని వైద్యులు కూడా చెప్తున్నారు . వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. చాలామంది జీర్ణ సమస్యలు ఉంటాయి. బీన్స్​తో ఆ సమస్యను అధిగమించొచ్చు. అధిక బరువు ఉన్నవాళ్లు బీన్ తినొచ్చని ఆహార నిపుణులు చెప్తున్నారు .బీన్స్‌ నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్స్‌‌ ఇందులో ఉంటాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థా యిని నిర్దిష్టం గా ఉంచుతుంది.శరీర పెరుగు దలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌‌కు మూలాధారం అవటం వలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం. బీన్స్‌‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు.