వైరల్‌‌ ఇన్ఫెక్షన్‌‌ పోగొట్టే జ్యూస్‌‌

వైరల్‌‌ ఇన్ఫెక్షన్‌‌ పోగొట్టే జ్యూస్‌‌

రెండ్రోజుల నుంచి కొద్దిగా చినుకులు పడుతున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో ఇప్పుడు కొన్ని వైరల్‌‌ ఇన్ఫెక్షన్స్‌‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ విపరీతంగా ఉండటంతో ఏది వైరల్‌‌ ఇన్ఫెక్షన్‌‌? ఏది కరోనా? అని తెలుసుకునే పరిస్థితులు లేవు. అందుకే, ఇమ్యూనిటీని పెంచుకుంటే ఎలాంటి వైరల్‌‌ ఇన్ఫెక్షన్స్ మన దగ్గరకు రావు. బీట్‌‌రూట్‌‌, క్యారెట్ జ్యూస్‌‌ తాగితే ఇమ్యూనిటీ బూస్ట్‌‌ అవుతుంది. బీట్‌‌రూట్‌‌లో ఉండే విటమిన్‌‌ – సి ఎర్రరక్త కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. దీంతో బాడీలో ఇన్ఫెక్షన్‌‌ రాదు. క్యారెట్‌‌లో ఉండే విటమిన్‌‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూన్‌‌ సెల్స్‌‌ను రక్షిస్తాయి. దాంట్లోని విటమిన్‌‌ బి6  వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటాం. జ్యూస్‌‌లో అల్లం వేసుకోవడం వల్ల అది ఇన్ఫెక్షన్స్‌‌ను రానీయకుండా ఫైట్‌‌ చేస్తుంది.  

తయారీ: ఒక్కో క్యారెట్‌‌, బీట్‌‌రూట్‌‌లను కడిగి చెక్కుతీసి చిన్న ముక్కలుగా కోయాలి. జ్యూసర్‌‌‌‌లో వేసి మెత్తగా గ్రైండ్‌‌ చేయాలి.తర్వాత జ్యూస్‌‌ను గ్లాసులో పోసి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా అల్లం తరుగు కలిపితే క్యారెట్‌‌ బీట్‌‌రూట్‌‌ జ్యూస్‌‌ రెడీ.