వికారాబాద్ అడవుల్లో పెద్ద పులి : సీసీ కెమెరాల్లో చిక్కింది

వికారాబాద్ అడవుల్లో పెద్ద పులి : సీసీ కెమెరాల్లో చిక్కింది
  •     భయాందోళనలో పరిసర గ్రామాల జనం

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం ఫారెస్ట్ ఏరియాలో చిరుత తిరుగుతుండటం కలకలం రేపుతోంది. రెండ్రోజుల కిందట దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పొలం పనులు ముగించుకొని   ఇంటికి వెళుతున్న రైతులకు చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం ఓ లేగ దూడను చిరుత తిన్నట్లు ఫారెస్ట్ ఏరియా దగ్గరలోని తండా వాసులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు దామగుండం ఏరియాలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అయితే, గురువారం సీసీ కెమెరాల్లో చిరుత కనిపించినట్లు ఫారెస్ట్ అధికారి  జ్ఞానేశ్వర్ వెల్లడించారు. దామగుండం ఫారెస్ట్ ఏరియాలోకి ఎవరూ వెళ్లొద్దని, చీకటి పడక ముందే ఇండ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఫారెస్ట్ ఏరియాకు దగ్గరలో ఉన్న గ్రామాలు, తండాల వాసులు  అప్రమత్తంగా ఉండాలన్నారు. తొందరలోనే చిరుతను పట్టుకుని జూపార్కుకు తరలిస్తామన్నారు.