ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

చిరుత పులులు పరుగెత్తడం చూస్తే దిమ్మతిరగాల్సిందే. వేటాడడంలో, పరుగెత్తడంలో వాటికవే సాటి. అయితే చిరుత జాతుల్లో అసినోనిక్స్ జుబాటస్ జాతికి చెందిన చీతా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. ఈ చీతా ఎంత సమయం పాటు అయినా పరుగెత్తి పట్టుకోగలదు. అలసిపోయి  మధ్యలో ఆగిపోవడం తెలియని ఈ జంతువు శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఎంత పరుగెత్తినా ఆయాస పడదు. అలాంటి ఒక చీతా ఆహారం కోసం జంతువును వేటాడుతూ అతి వేగంగా పరుగెత్తడాన్ని కెమెరాలో బంధించారు. వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది.

 అది పరిగెడుతున్న సమయంలో దాని ముఖం, కాళ్లు, బాడీ మొత్తం కదిలిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా చిరుత పులులు గంటకు 60 మైళ్ల దూరం వేగంతో పరుగెత్తుతుంటాయి. ఒక మైలు అంటే 1.60 కిలోమీటర్లు. అయితే ఇదేమీ గరిష్ఠ పరిమితి కాదు. అవసరమైతే కోరుకున్న జంతువును ఆరగించేందుకు తన వేగాన్ని మరింత పెంచగలదు. ఈ వీడియోలోని చిరుత ఏకంగా గంటకు 70 మైళ్ల వేగంతో పరుగెత్తింది. అంటే 112 కిలోమీటర్ల వేగం. ఓ రైలు వేగానికి సమానంగా పరుగెత్తినట్టు. ఒక్కో అంగ 22 అడుగుల దూరం ఉందంటే దీని బలం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి ఈ వీడియోను కోటి మంది చూశారు. దీన్ని ఫ్యాసినేటింగ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.