వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన క్రమంలో.. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది.
పెట్రోల్ లో 20 నుంచి 30 శాతం ఇథనాల్ కలిగి ఉన్న పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశమైన ఇండియా.. పూర్తిగా దిగుమతులపై ఆధారపడకుండా.. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటంతో భారం తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు.
- ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు అంటే?
ఎక్సైజ్ డ్యూటీ అనేది ఆయిల్ సహా సహా కొన్ని వస్తువులపై ప్రభుత్వం విధించే పన్ను. అధిక ఇథనాల్ శాతం ఉన్న పెట్రోల్‌కు ఈ సుంకం నుండి మినహాయింపు ఇవ్వడం ద్వారా, ఆ పెట్రోల్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యం. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ 22 నుంచి నుండి 30 శాతం మధ్య ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు వర్తిస్తుంది.
రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మే సాధారణ పెట్రోల్‌కు సంబంధించి ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రభుత్వ నిర్ణయం అధిక ఇథనాల్ కలిపిన ఆయిల్ వినియోగాన్ని, సరఫరాను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
