హీరోయిన్ నభా నటేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా సరసన ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘కెమిస్ట్రీ’. విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
రొమాంటిక్ సినిమాలతో కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నభా నటేష్.. కొంత గ్యాప్ తర్వాత మరోసారి పూర్తిస్థాయి ప్రేమకథలో కనిపించబోతోంది. ఇదొక కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
