చీనాబ్ ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా .. పాకిస్తాన్కు భారీగా వరద నీరు.. ఆ ప్రాంతాకు ముంపు తప్పదు

చీనాబ్ ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా .. పాకిస్తాన్కు భారీగా వరద నీరు.. ఆ ప్రాంతాకు ముంపు తప్పదు

 =ముజఫరాబాద్, సియాల్ కోట్ లకు ముప్పు
= జమ్మూలో భారీ వర్షాలతో పెరిగిన నీటి మట్టం
= అందుకే గేట్లు ఎత్తారని సమాచారం

శ్రీనగర్: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్  సిందూర్ నేపథ్యంలో భారత్–పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో  చోటు చేసుకున్న మరో ఘటన దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  చీనాబ్ నదిపై భారత్ నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యాముల గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్‌లోని ఆ నది ఎండిపోయింది.   

భారత్ బాగ్లీహార్ డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా వరద నీరు పాకిస్తాన్‌కి వెళ్తోంది. దీంతో మరోసారి, పాకిస్తాన్‌లో భయం మొదలైంది.  జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరగడంతో గేట్లు ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా భారత్ ఈ చర్య చేపట్టలేదని తెలుస్తోంది. 

►ALSO READ | చైనా సరుకుతో యుద్ధం చేయలేమంటున్న పాక్ ఆర్మీ: తుస్సుమంటున్న చైనా బాంబులు, మిస్సైల్స్

గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా వరద నీరు పాకిస్తాన్ వైపు వెళ్తోంది. ముఖ్యంగా, నదీ ఒడ్డున ఉన్న ముజఫరాబాద్, సియాల్ కోట్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఏర్పడింది.