భారతీయుడు 2 మూవీ నుండి చెంగల్వ అనే పాటను విడుదల

భారతీయుడు 2 మూవీ నుండి చెంగల్వ అనే పాటను విడుదల

కమల్ హాసన్,  శంకర్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకను గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ‘చెంగల్వ’ అనే పాటను విడుదల చేశారు.  సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల్ ప్రీత్ సింగ్ జంటపై చిత్రీకరించిన  ఈ పాటను అనిరుధ్ కంపోజ్ చేయగా,  అబ్బి, శ్రుతికా స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముద్రాల పాడారు. 

చెంగల్వ చేయందేనా..  చెలికాని చేరేనా.. నిజమేనా నిశాంతమేనా, సంద్రాలు రుచి మార్చేనా.. మధురాలు పంచేనా.. ఇది వేరే ప్రపంచమేనా’ అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.  కాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ అగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియా భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వానీ శంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.జె.సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మూవీస్ సంస్థలు  నిర్మిస్తున్నాయి.  జులై 12న తెలుగు, తమిళ,  హిందీ భాషల్లో విడుదల కానుంది.