
చెన్నై ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం రేగింది. రెండు వేరువేరు ఘటనల్లో రూ. 12 కోట్ల విలువైన 11.8 కేజీల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. చెన్నై ఎయిర్ పోర్టులో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్యాసెంజర్ల నుంచి రూ. 12 కోట్ల విలువైన 11.8 కేజీల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
గుర్తు తెలియని వ్యక్తులు చెన్నైల్లో ఇవ్వమని పార్సిల్ ఇచ్చారని చెబుతున్నారు గంజాయితో పట్టుబడ్డ ప్యాసెంజర్లు. ముందస్తు సమాచారంతో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు.
స్మగ్లర్లు ప్లాస్టిక్ కవర్లలో ప్రాసెస్ చేసిన హైగ్రేడ్ గంజాయిని పార్సిల్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్మగ్లర్ల వెనక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తన్నారు పోలీసులు.