లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్‌లో సెఖ్‌మెట్ బార్ పైకప్పు నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బార్ లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు కూలిపోయిన శిథిలాల కింద పడి అక్కడిక్కడే చనిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ టీం, పోలీసులు అక్కడికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. బార్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. బిల్డింగ్ స్లాబ్ పటిష్ఠంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. 

కానీ ఉన్నటుండి ఇలా కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే బార్‌కు దగ్గర్లో  మెట్రో లైన్ నిర్మాణం జరుగుతుందని.. అక్కడ జరిగే పనుల్లో భూమి కంపనలకు గురవడం వల్ల రూఫ్ ఊడిపడిందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ బిల్డింగ్ ఎలాంటి ప్రకంపనకు గురికాలేదని అక్కడి సిబ్బంది చెప్తున్నారు. బార్ కు 420 మీటర్ల దూరంలో జరుగుతున్న చెన్నై మెట్రో రైలు నిర్మాణమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బార్ పైకప్పు ఊడిపడడానికి గల కారణాలు త్వరలోనే తెలుసుకుంటామని చెన్నై ఈస్ట్ పోలీసు జాయింట్ కమిషనర్ జి ధర్మరాజన్ అన్నారు.