చెత్త నిర్వహణపై చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ వేస్తే భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. గతంలో రూ. 500 ఉన్న చెత్త జరిమానా ఇప్పుడు రూ. 5వేలు చెన్నై కార్పొరేషన్ వసూలు చేస్తుంది. డిజిటల్ స్పాట్ ఫైనింగ్ విధానంలో ప్రత్యేకంగా డివైజ్ లను ఉపయోగిస్తూ చెత్త జరిమానా వసూలు చేస్తుంది.
ఇప్పటివరకు 289 మంది నుంచి రూ.5లక్షల చెత్త జరిమానా వసూలు చేసినట్లు చెన్నై కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో చెత్తపై పెనాల్టీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వ్యర్థాలను పారబోస్తే జరిమానా 10 రెట్లు పెంచింది. రూ. 500 నుంచి రూ. 5వేలకు పెంచింది. ప్రైవేటు , ప్రభుత్వ స్థలాల్లో వ్యార్థలను కాల్చే వారికి రూ. 500 నుంచి రూ.5వేలకు సవరించారు.
వ్యర్థాలను పబ్లిక్ ప్లేసుల్లో పారబోసినా.. తగలబెట్టినా.. స్పాట్ లోనే ఫైన్ విధించే విధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 70 పాయింట్ ఆఫ్ సేల్ (PoS) డివైజ్ లను పారిశుధ్య కార్మికులకు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 289 నుంచి మొత్తం రూ. 5లక్షల వరకు జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్ ను కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.