
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Alikhan) గత కొంతకాలంగా వార్తల్లో వైరల్ అవుతూనే ఉన్నాడు. స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)పై ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచనలనం క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మన్సూర్ చేసిన కామెంట్స్ పై త్రిషనే కాదు.. అన్ని సినీ ఇండస్ట్రీల నుండి పెద్దలు రియాక్ట్ అయ్యారు. అందులో టాలీవుడ్ నుండి చిరంజీవి, నటి ఖుష్బూ, సింగర్ చిన్మయి.. వంటి చాలా మంది సెలబ్రిటీలు త్రిషకు మద్దతుగా నిలిచారు.
దీంతో త్రిషకు మద్దతుగా మాట్లాడినందుకు గానూ.. త్రిష, చిరంజీవి, ఖుష్బూపై పరువునష్టం దావా వేశాడు నటుడు మన్సూర్. తాను అమాయకుడినని, తనపై అణిచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ ముగ్గురి నుండి తలా కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలంటూ పిటిషన్ వేశాడు.
ఈ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. మన్సూర్ కుక్ మొట్టికాయలు వేసింది. నటిపై మన్సూర్ చేసిన అసభ్య కామెంట్స్ గాను ముగ్గురు నటులు ఆమెకు మద్దతు నిలిచారు. అలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా అలాగే స్పందిస్తాడు కాబట్టి.. ఈ విషయంలో వారిపై పరువు నష్టం దావా వేయడం కుదరదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్లే అనిపిస్తోంది.. అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీశ్ కుమార్ మన్సూర్ పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాకుండా.. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని మన్సూర్ కు ఆదేశించారు.