చెన్నైలో మెట్రో ఫేజ్ 2 షురూ  రూ.13,000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు  శ్రీకారం

చెన్నైలో మెట్రో ఫేజ్ 2 షురూ  రూ.13,000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు  శ్రీకారం

 

  • స్వయంగా టికెట్ కొన్న ప్రధాని నరేంద్ర మోదీ
  • తమిళనాడు సీఎం విజయ్​తో కలిసి ప్రయాణం
  •  

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్ కలిసి మెట్రోలో జర్నీ చేశారు. చెన్నైలోని పొరూర్ నుంచి పూనమల్లీ వరకు వారిద్దరూ ప్రయాణించారు. ఇందుకోసం స్వయంగా మోదీ టికెట్ కొనుగోలు చేసి వెళ్లారు. అంతకుముందు 15 కిలోమీటర్ల మేర రూ.4,900 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేజ్ 2ను  గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌‌తో కలిసి పీఎం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ మార్గంలో డ్రైవర్‌‌ లెస్ రైలు నిర్వహణకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్ ఉన్నాయి. పూనమల్లి బైపాస్ నుంచి వడపళని వరకు గల ఈ రూట్​లో మొత్తం 11 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ విస్తరణతో చెన్నై పశ్చిమ శివారు ప్రాంతాలు, సిటీ సెంటర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అంచనావేస్తున్నారు. అలాగే, రోజువారీ ప్రయాణికులకు జర్నీ సమయాన్ని తగ్గిస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికుల సేవలు ప్రారంభం కాగా, ఇవాల్టి (అక్టోబర్ 12) నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెగ్యులర్ సర్వీసులు నడవనున్నాయి. కాగా, ఈ నెల 10న (శనివారం) చెన్నైకి వచ్చిన మిత్రపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన తమిళనాడు సీఎం విజయ్.. ఆ మరుసటి రోజు ఆదివారం ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

రూ.13,000 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ పర్యటనలో భాగంగా రవాణా, హైవేలు, పోర్టులు, పెట్రోలియం, విద్యారంగాలకు సంబంధించి మొత్తం రూ.13,000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు పీఎం మోదీ శ్రీకారం చుట్టారు. అంతకుముందు చెన్నై ఎయిర్​పోర్టులో ప్రధానికి సీఎం విజయ్ ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన మోదీ కాన్వాయ్‌‌కి దారి పొడవునా బీజేపీ కార్యకర్తలు గ్రాండ్​వెల్​కమ్​చెప్పారు. అలాగే, ఐఐటీ–-మద్రాస్ క్యాంపస్‌‌లోని చరిత్రాత్మక శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. పీఎం చెన్నై పర్యటన నేపథ్యంలో చెన్నై సిటీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.