ఇకపై మరింత ఈజీగా.. వాట్సాప్ ద్వారా మెట్రో రైలు QR టిక్కెట్లు

ఇకపై మరింత ఈజీగా.. వాట్సాప్ ద్వారా మెట్రో రైలు QR టిక్కెట్లు

హరిత వాతావరణం, డిజిటల్ కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో స్టేషన్ల టిక్కెట్ కౌంటర్లలో ప్రయాణీకులకు వాట్సాప్ (WhatsApp) ద్వారా క్యూఆర్(QR) టిక్కెట్లను పంపిణీ చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కోయంబేడు, ఎయిర్‌పోర్ట్ అనే రెండు స్టేషన్‌లలో టికెటింగ్ ఫీచర్ మొదట అమలైంది. ప్రయాణికుల నుండి సానుకూల స్పందన రావడంతో ఇప్పుడు మొత్తం 41 స్టేషన్‌లకు విస్తరించారు.

అంతకుముందు, CMRL స్టేషన్లలో అందుబాటులో ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ QRని ఉపయోగించి పేపర్ QRని భర్తీ చేశారు. ఈ క్రమంలోనే మొబైల్ యాప్‌ల ద్వారా QR టిక్కెట్‌లను, వాట్సాప్ (WhatsApp), పేటీఎం (Paytm), ఫోన్ పే(PhonePe) వంటి వివిధ థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్లు పొందడం వంటి అనేక టికెటింగ్ పద్ధతులను ప్రవేశపెట్టారు.

వాట్సాప్‌లో టిక్కెట్లు

ఈ కొత్త విధానాన్ని జనవరి 24న సీఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంఏ సిద్ధిక్‌ ప్రారంభించారు. ఈ విధానంలో, ప్రయాణికులు కౌంటర్‌లో తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ప్రయాణీకులు మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, వాట్సాప్ ద్వారా టికెట్ నేరుగా వారి మొబైల్‌కు పంపబడుతుంది. లావాదేవీలు, ప్రయాణీకుల డేటా ప్రైవసీల నిమిత్తం CMRL సిస్టమ్‌లో ప్రయాణీకుల మొబైల్ నంబర్‌లు సేవ్ కాకుండా ఈ ఫీచర్ ను రూపొందించారు.

వాట్సార్ ద్వారా QR టిక్కెట్‌ను ఎలా పొందాలంటే:

  • మీ QR టికెట్ కోసం టికెట్ కౌంటర్‌ దగ్గరికి వెళ్లండి
  • గమ్యస్థానం, టిక్కెట్ల సంఖ్య గురించి ఆపరేటర్‌కు తెలియజేయండి.
  • టికెట్ కౌంటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన కీప్యాడ్ ద్వారా మీ వాట్సాప్ నంబర్‌ను నమోదు చేయండి.
  • CMRL అధికారిక నంబర్ నుంచి మీ వాట్సాప్ చాట్ లో టిక్కెట్ వివరాలున్న క్యూఆర్ కోడ్ ను పొందాలి.