బీచ్‌లో బోర్ : చెన్నైలో తీవ్ర కరువు

బీచ్‌లో బోర్ : చెన్నైలో తీవ్ర కరువు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులకు ఈ ఫొటో ఓ ఉదాహరణ. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో కరువు పరిస్థితులు జన జీవనానికి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తాగడానికి నీళ్లు లేక జనం గొంతెండుతోంది. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల సహకారంతో.. వాటర్ ట్యాంకులతో పలు కాలనీల్లో నీటి సరఫరా జరుగుతోంది.

చెన్నై నగరంలోని వేలాది బోర్లు డ్రై అయిపోయాయి. నీళ్లు పాతాళంలోకి వెళ్లిన పరిస్థితి. దీంతో.. మెరీనాబీచ్ లో ప్రత్యేకంగా బోర్లు వేశారు. అడుగున ఉన్న నీళ్లను హ్యాండ్ పంప్ తో తోడుకుంటూ బీచ్ పరిసరాల్లోని జనం గొంతు తడుపుకుంటున్నారు. ఈసారైనా వర్షాలు పడితేగానీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.