ఏం జరిగిందంటే : ఆ బిజినెస్ మేన్ అరెస్ట్ వెనక నటి గౌతమి

ఏం జరిగిందంటే : ఆ బిజినెస్ మేన్ అరెస్ట్ వెనక నటి గౌతమి

నటి గౌతమికి ఓ రియల్ వ్యాపారులు కుచ్చుటోపి పెట్టారు. నమ్మించి నట్టేట ముంచుదామునుకున్న కేటుగాళ్లను పోలీసులకు పట్టించింది. చెన్నైలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఎన్‌ట్రస్ట్‌మెంట్ డాక్యుమెంట్ ఫ్రాడ్ (ఇడీఎఫ్) వింగ్ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. 

తిరువళ్లూరు జిల్లా కొట్టైయూర్ గ్రామంలో 8.63 ఎకరాల ఉన్న తన ఆస్తిని 2015లో విక్రయించాలని గౌతమి నిర్ణయించుకున్నారు. అన్నానగర్‌కు చెందిన బలరామన్, చెంగల్‌పట్టుకు చెందిన రఘునాథన్ అనే ఇద్దరు వ్యక్తులు ల్యాండ్ కొంటామని ముందుకు వచ్చారు.  తమకు అనుకూలంగా గౌతమి నుండి పవర్ ఆఫ్ అటార్నీని పొందారు. ఆ తర్వాత.. వారు ఆమె ఆస్తిని ముంబైకి చెందిన జయ హింద్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. గౌతమికి మాత్రం రూ.4.10 కోట్లు ఇచ్చారు.

అయితే, 2021లో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందిన తర్వాత.. బలరామన్, రఘునాథన్ తమ ఆస్తులను రూ.12 కోట్లకు విక్రయించారని, తనకు రూ..4.10 కోట్లు చెల్లించాలని గౌతమిపై ఫిర్యాదు చేశారు. మిగిలిన మొత్తాన్ని దుర్వినియోగం చేశారని చెప్పారు. దీంతో వారు తనను మోసం చేశారని గౌతమి ఆరోపించింది. గౌతమి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

Also Read :- వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే

అసిస్టెంట్ కమిషనర్ ఎస్. జాన్ విక్టర్ నేతృత్వంలోని పోలీసు బృందం అన్ని కోణాల్లో విచారణ సాగిస్తోంది. పరారీలో ఉన్న నిందితులలో ఒకరైన అన్నానగర్ వెస్ట్‌కు చెందిన జె. బలరామన్ (64)ను అరెస్టు చేసింది. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పరారీలో మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.