
చెన్నై: పవర్ఫుల్ పేస్ బౌలింగ్‌తో అదరగొట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్‌లో ఆరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. పేసర్లు మతీష పతిరణ (3/15), దీపక్ చహర్ (2/18), తుషార్ దేశ్‌పాండే (2/26) దుమ్మురేపడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌కు ఈజీగా చెక్ పెట్టింది. టాస్ ఓడిన ముంబై తొలుత 20 ఓవర్లలో 139/8 స్కోరు చేసింది. నెహాల్ వదేరా (51 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీ సాధించగా, మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 140/4 స్కోరు చేసింది. డేవన్ కాన్వే (42 బాల్స్‌లో 4 ఫోర్లతో 44), రుతురాజ్ గైక్వాడ్ (16 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) నిలకడగా ఆడారు. పతిరణకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 13 ఏళ్లుగా చెపాక్‌లో ముంబైపై గెలవని రికార్డును సీఎస్కే ఈ మ్యాచ్ ద్వారా బ్రేక్ చేసింది.
ఏడుగురు సింగిల్ డిజిట్‌కే..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి సీఎస్కే పేసర్లు చుక్కలు చూపెట్టారు. దీపక్, తుషార్ దెబ్బకు ఏడు బాల్స్ తేడాలో గ్రీన్ (6), ఇషాన్ (7), రోహిత్ (0)పెవిలియన్‌కు వచ్చేశారు. ఈ ముగ్గురి ఔట్ మధ్య ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై 16/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో వదేరా, సూర్యకుమార్ (26) నిలకడగా ఆడినా భారీ షాట్లు కొట్టలేకపోయారు. దీంతో పవర్‌ప్లేలో 34/3 స్కోరు చేసిన ముంబై ఫస్ట్ టెన్‌లో 64/3కే పరిమితమైంది. 11వ ఓవర్‌లో జడేజా (1/37) సూపర్ టర్న్‌కు సూర్య ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 55 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి పతిరణ జోరందుకున్నాడు. యాంగిల్ బాల్స్‌తో బ్యాటర్లను బాగా ఇబ్బందిపెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. ఫలితంగా వదేరా, స్టబ్స్ (20) సిం గిల్స్, డబుల్స్‌తోనే ముందుకెళ్లారు. దాదాపు ఏడు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ జోడీని 18వ ఓవర్‌లో వదేరాను ఔట్ చేసి పతిరణ విడగొట్టాడు. తర్వాతి ఓవర్‌లో దేశ్‌పాండే.. టిమ్ డేవిడ్ (2) వికెట్ తీయగా, చివరి ఓవర్‌లో పతిరణ నాలుగు బాల్స్ తేడాలో స్టబ్స్, అర్షద్ ఖాన్ (1)ను ఔట్ చేసి ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.
‘టాప్’ లేపారు..
చిన్న టార్గెట్‌ను చెన్నై ఈజీగా ఛేజ్ చేసింది. తొలి ఓవర్లోనే రుతురాజ్ రెండు ఫోర్లతో టచ్‌లోకి రాగా, రెండో ఓవర్లో కాన్వే ఫోర్‌తో ముందుకెళ్లాడు. థర్డ్ ఓవర్‌లో రుతురాజ్ 6, 4, 4, 6తో 20 రన్స్ దంచాడు. తర్వాతి ఓవర్‌లో కాన్వే రెండు ఫోర్లతో ఊపు తెచ్చాడు. కానీ ఐదో ఓవర్‌లో రుతురాజ్ ఔట్‌కావడంతో ఫస్ట్ వికెట్‌కు 46 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఇక్కడి నుంచి రహానె (21) వేగంగా ఆడినా వికెట్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. 9వ ఓవర్‌లో సిక్స్ కొట్టిన రహానె లాస్ట్ బాల్‌కు వెనుదిరిగాడు. సగం ఆట ముగిసే సరికి చెన్నై 84/2తో నిలిచింది. ఈ దశలో వచ్చిన అంబటి రాయుడు (12) సిక్స్ కొట్టి వికెట్ ఇచ్చుకున్నా.. శివం దూబే (18 బాల్స్‌లో 3 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు దంచాడు. 17వ ఓవర్‌లో కాన్వే ఔటైనా, ధోనీ (2 నాటౌట్) సాయంతో దూబే సీఎస్కేకు విక్టరీ అందించాడు. ముంబై బౌలర్లలో చావ్లా 2 వికెట్లు తీశాడు.
రోహిత్ 16 సున్నాలు
ఐపీఎల్‌లో అత్యధికంగా 16 సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్, నరైన్ 15 డకౌట్లతో తర్వాతి ప్లేస్‌ల్లో ఉన్నారు
తీక్షణ @ 152 కేపీహెచ్? చెన్నై స్పిన్నర్ తీక్షణ ముంబై ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బాల్‌ను 152 కి.మీ వేగంతో వేసినట్టు స్ర్కీన్ పై కనిపించడం ఆశ్చర్యపరిచింది. స్పీడో మీటర్ తప్పుగా చూపించినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో జోక్స్ పేలాయి.