సీఎస్కేకు స్టోక్స్‌‌ దూరం?

సీఎస్కేకు స్టోక్స్‌‌ దూరం?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌  ఇంగ్లండ్ ఆల్‌‌రౌండర్‌‌‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ను తమ టీమ్‌‌ నుంచి  రిలీజ్‌‌ చేసే అవకాశం కనిపిస్తోంది. మోకాలి గాయానికి త్వరలో సర్జరీ చేయించుకోనున్న స్టోక్స్‌‌ వచ్చే సీజన్‌‌లో ఇంగ్లండ్ ఆడే అన్ని టెస్టులకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. 

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌‌ కప్ కూడా ఉన్న నేపథ్యంలో  ఐపీఎల్‌‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌‌ వేలానికి ముందు స్టోక్స్‌‌ను రిలీజ్‌‌ చేస్తే సీఎస్కేకు రూ. 16.25 కోట్లు సమకూరనున్నాయి.