
ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడింది. ఆదివారం (మే 25) గుజరాత్ టైటాన్స్ పై మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బ్రేవీస్ (23 బంతుల్లో 57: 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కాన్వే (52) హాఫ్ సెంచరీకి తోడు ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
ALSO READ | GT vs CSK: మోత మోగించిన మాత్రే.. ఒకే ఓవర్లో 28 పరుగులతో రెచ్చిపోయిన 17 ఏళ్ళ కుర్రాడు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ప్రారంభం నుంచి రెచ్చిపోయి ఆడింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే 28 పరుగులు రాబట్టి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మాత్రే ధాటికి చెన్నై పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. మాత్రే ఔటైనా ఆ తర్వాత ఉర్విల్ పటేల్, కాన్వే జట్టును ముందుండి నడిపించారు. ముఖ్యంగా ఉర్విల్ బౌండరీల వర్షం కురిపించాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన ఉర్విల్.. 19 బంతుల్లోనే 37 పరుగులు చేసి పెవిలియ చేరాడు.
ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నిలకడగా ఆడాడు. స్వల్ప వ్యవధిలో దూబే, కాన్వే ఔటైనా చెన్నై పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న బ్రేవీస్ ఈ మ్యాచ్ లో కూడా భారీ హిట్టింగ్ తో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని చెన్నై స్కోర్ ను 230 పరుగుల మార్క్ కు చేర్చాడు. మొదటి 10 ఓవర్లలో 115 పరుగులు చేసిన చెన్నై చివరి 10 ఓవర్లలో కూడా 115 పరుగులు రాబట్టింది.
Brevis at the death powers Chennai to their highest total of the season 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) May 25, 2025
🔗 https://t.co/T366RayUY4 | #IPL2025 pic.twitter.com/1w4lvU5peR