
వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదా గల ఈ పదవిలో రమేష్ బాబు ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. జర్మనీకి చెందిన హాంబోల్డ్ యూనివర్శిటీ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో పరిశోధనలు చేసి పీహెచ్ డీ పట్టా పొందారు చెన్నమనేని.
ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో వేములవాడ సీటు చల్మడ లక్ష్మీనర్సింహారావుకు కేటాయించారు కేసీఆర్. పౌరసత్వం వివాదం కోర్టులో ఉండటంతో ఆయనకు సీటు ఇవ్వలేదని చెప్పారు. అసంతృప్తితో ఉన్న చెన్నమనేని పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రమేశ్ బాబుకు ఈ పదవి అప్పగించినట్లు తెలుస్తోంది. .