నిధులు వచ్చేలా చూడండి : చెన్నూరు పాలకవర్గం

నిధులు వచ్చేలా చూడండి : చెన్నూరు పాలకవర్గం
  • ఎమ్మెల్యే వివేక్​కు చెన్నూరు పాలకవర్గం వినతి

చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.28 కోట్ల నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని మున్సిపల్ వైస్ చైర్మెన్ నవాజొద్దిన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంలాల్ గిల్డా కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని హైదారాబాద్​లోని తన నివాసంలో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.