మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎన్ వీఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్, ఎంపీటీసీ సభ్యుడు బొమ్మన హరీశ్ గౌడ్–స్ఫూర్తి వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ హాజరయ్యారు. 

ఎమ్ఎన్​ఆర్ గార్డెన్స్​లో రవీందర్ రెడ్డి–రమ్య, ఇందు గార్డెన్స్​లో క్రాంతి కుమార్–త్రిసంధ్య, కోటేశ్వరరావు పల్లిలోని లక్ష్మీ గార్డెన్స్ లో జవహర్ సాయి–ప్రణతి, కుర్మపల్లి గ్రామంలో నరేశ్–అనిత, మంచిర్యాలలోని శుభం ఫంక్షన్ హాల్​లో సాయికృష్ణ–నవ్యశ్రీ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు గద్దెరగడిలో లక్ష్మీ జ్యొవలరీ షాప్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

పలువురి చేరిక

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన నిమ్మ రాజయ్య, బల్లా మల్లయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఫయాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన టేకుమట్ల మాజీ సర్పంచ్ గోనె రాములు, బడుగు బాణయ్య బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు.