ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వివేక్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వివేక్

చెన్నూరు, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెన్నూరు మండలంలోని కన్నెపెల్లి గ్రామానికి వెళ్లగా.. తాము తీవ్ర మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్తులు తమ సమస్యను వివేక్ వెంకటస్వామి​దృష్టికి తీసుకెళ్లారు.  గ్రామస్తుల గోడు విన్న వివేక్​తాను గెలిచిన తర్వాత గ్రామంలో బోరు వేయిస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట నెరవేరుస్తూ శుక్రవారం గ్రామంలో బోరు వేయించారు. తాగు నీటి సమస్య తీరనుండడంతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు హిమవంత రెడ్డి, సుశీల్ కుమార్, గ్రామస్తులు మాయ రమేశ్, జనగామ శ్రీనివాస్, గట్టు, అక్కెం బాణయ్య, సాయి, రవి కిరణ్ పాల్గొన్నారు.