వార్డెన్ బాధలు భరించలే పోతున్నాం.. మేము హాస్టల్ కు వెళ్లం.. ఇక్కడే ఉంటాం..

వార్డెన్ బాధలు భరించలే పోతున్నాం.. మేము హాస్టల్ కు వెళ్లం.. ఇక్కడే ఉంటాం..

రంగారెడ్డి జిల్లా  బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూర్  చెర్రిస్ హాస్టల్ వార్డెన్ తమను అనవసరంగా... అవమానించుచూ వేధిస్తూ.. కొడుతుందని  విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మేము హాస్టల్ కు వెళ్లమని ఇక్కడే ఉంటామన్నారు. తమను చితకబాదుతోందని, తాము హాస్టల్ కు వెళ్లమని పలు వురు విద్యార్థినిలు ఉపాధ్యా యుల ఎదుట బోరున విలపించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీమ్ కు  ఫిర్యాదు చేయడం తో వారి సూచనమేరకు రాజేం ద్రనగర్ పోలీస్ స్టేషకు  చేరు కున్నారు. తాము హాస్టల్ కు వెళ్లమని... వార్డెన్ వేధింపులు భరించలేమని పోతున్నామని రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ కు  మొర పెట్టుకు న్నారు. 

కిస్మాత్ పూర్ లో చెర్రీస్ స్వచ్ఛంద సంస్థ హాస్టల్ ను  నీలిమ అనే మహిళ నిర్వహిస్తుంది. సదరు హాస్టల్లో సునీత అనే మహిళ  వార్డెన్ గా  పని చేస్తోంది. బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఈ హాస్ట ల్లో ఆశ్రయం పొందుతున్నారు. వార్డెన్ సునీత తరుచూ తమను అవమానకరమైన పదజాలంతో  వేధిస్తుందని  ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. పోలీస్టేషన్ లో  ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థినులు తాము హాస్టల్ కు వెళ్లమని, ఇక్కడే ఉం టామని చెప్పడంతో ఉపాధ్యాయులు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు.  షీ టీమ్ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినులు  ఉపాధ్యాయు లతో కలిసి  రాజేంద్రనగర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.   బాధితుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వార్డెన్ సునీతను పోలీసులు  విచారించారు.