బీఆర్ఎస్ లో చేరిన చెరుకు సుధాకర్..

బీఆర్ఎస్ లో చేరిన చెరుకు సుధాకర్..

డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి.. కొద్దిరోజుల్లులోనే రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ శనివారం మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్, చెరుకు సుధాకర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. కాంగ్రెస్ పార్టీపై తానకు రెస్పెక్ట్ ఉంటుందని చెరుకు సుధాకర్ అన్నారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.