
న్యూఢిల్లీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. సౌతాఫ్రికా టూర్‌లో విఫలమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె కాంట్రాక్ట్‌ను గ్రేడ్–ఏ నుంచి ‘బి’కి డిమోట్ చేయనున్నారు. అదే టైమ్‌లో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కాంట్రాక్ట్‌ను గ్రేడ్‑సి నుంచి ‘ఏ లేదా బి’కి ప్రమోట్ చేసే చాన్స్ ఉంది. అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 మధ్య కాలానికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బోర్డు ఇప్పటికే రెడీ చేసింది. ఇషాంత్ కాంట్రాక్ట్ కూడా గ్రేడ్–బికి పడిపోనుంది. స్పిన్నర్ అక్షర్ పటేల్ గ్రేడ్–సి నుంచి బికి మారనున్నాడు. శార్దూల్ ఠాకూర్ గ్రేడ్–బిలోనే ఉండనున్నాడు. క్రికెటర్ల పెర్ఫామెన్స్ ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్‌ను నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేశారు. గ్రేడ్–ఏ+లో ఉన్న ప్లేయర్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్–ఏలో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్–బిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్–సిలో ఉన్న వారికి కోటి చెల్లిస్తారు.