
వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా ఎంపీలను గెలుస్తుందని, మళ్లీ ప్రధానిగా మోదీనే అయితరని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా యాలాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఇవి రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, ఉత్తమ్ ఎన్నికలు కావని, ఇవి మోదీ ఎన్నికలని పేర్కొన్నారు. మోదీని ఎవరూ అడ్డుకోలేరని, ఆయనకు పోటీ ఎవరూ లేరన్నారు. కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి విశ్వేశ్వర్ రెడ్డి పూలమాలేసి నివాళులర్పించారు.