ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!

ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఖాళీ బాటిళ్లలో ఎరుపు రంగు నీటిని నింపి ఇంటి ముందు ఉంచుతున్నారు. ఇలా చూస్తే కుక్కలు ఇంటి దగ్గరకు రావడం లేదని చెబుతున్నారు. కుక్కల బెడద తీర్చాలని మున్సిపల్ అధికారులకు  చెప్పినా పట్టించుకోవడంతో ఇలా చిన్న ప్రయత్నం చేశామని అంటున్నారు.  – వెలుగు, చేవెళ్ల