- కలెక్టర్లకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన ఉత్తర్వు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్(పీఆర్), గ్రామీణాభివృద్ధి(ఆర్డీ) డైరెక్టర్ జి.సృజన ఆదేశించారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను ఫుల్‌టైమ్ బేసిస్‌లో భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెగ్యులర్ ఎంపీడీవోలు వచ్చే వరకు ఈ ఖాళీలను సూపరిటెండెంట్లు, మండల పంచాయతీ అధికారులతో రీడిప్లాయ్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయాలన్నారు.
వీరికి జీతం మాత్రం వారి ఒరిజనల్ కేడర్, ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడి నుంచి తీసుకునే షరతును తెలియజేయాలన్నారు. గురువారం ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలకు మెమో రూపంలో తెలియజేశారు. ఇక నుంచి ఎన్నికల అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని సృజన ఆదేశించారు. ముందస్తుగా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేకుండా డ్యూటీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు హెడ్‌క్వార్టర్ విడిచిపెట్టి రావొద్దని సూచించారు.
