కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం : భీం భరత్

కాంగ్రెస్ మేనిఫెస్టోలో  అన్ని వర్గాలకు న్యాయం : భీం భరత్

చేవెళ్ల, వెలుగు: అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ చేవెళ్ల సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. చేవెళ్ల మండలంలోని పల్గుట్ట, కందావాడ, నారాయణ దాస్​గూడ, ఎర్రోని కోటాల, మల్లారెడ్డిగూడ, అల్లవాడ, ఇక్కారెడ్డి గూడ, చన్ వల్లి, కేసారం, గొల్లగూడ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. పోలింగ్​కు మరో 12 రోజులు మాత్రమే టైమ్ మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

వీటితో ఇతర అంశాలను చేర్చి మేనిఫెస్టోను రూపొందించిందన్నారు. కర్నాటక తరహాలో తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగుల భృతి, జాబ్ క్యాలెండర్, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష సాయం, బంగారం.. ఇలా ఎన్నో ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందనని భీం భరత్ తెలిపారు. ఆయన వెంట సెగ్మెంట్ సీనియర్ నేత వసంతం, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, సర్పంచ్ సాయిరెడ్డి,  పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌‌రెడ్డి  పాల్గొన్నారు.