మహాపర్వ్.. కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుగాక.. మోదీ స్పెషల్ విషెస్

మహాపర్వ్.. కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుగాక.. మోదీ స్పెషల్ విషెస్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (నవంబర్ 19) సౌర దేవత సూర్యుడికి ప్రార్థనలు చేసే ప్రతి ఒక్కరికీ.. పురాతన హిందూ పండుగ 'ఛత్' శుభ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "మహాపర్వ ఛత్ సంధ్యా అర్ఘ్య సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. సూర్య భగవానుడి ఆరాధన ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుగాక. జై ఛతీ మైయా!" అంటూ ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఛత్ సందర్భంగా ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు. సూర్యదేవుడు, ఛతీ మైయా ఆశీర్వాదంతో ప్రపంచం ఆనందం, శ్రేయస్సు, శుభవార్తలతో బంగారు మయం కావాలని ప్రార్థించారు. "సూర్య ఆరాధన, జానపద విశ్వాసాల గొప్ప పండుగ 'ఛత్' సందర్భంగా రాష్ట్రంలోని భక్తులందరికీ, ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సూర్య దేవుడు, ఛతీ మైయా పవిత్ర ఆశీర్వాదంతో అందరికీ అదృష్టం కలిసి రావాలి . జై ఛతీ మైయా!" అంటూ సీఎం యోగి తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతకుముందు, నవంబర్ 18న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఛత్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. "మన నీటి వనరులు, పర్యావరణాన్ని కాలుష్య రహితంగా చేయడం కోసం ప్రకృతి మాతను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయండి" ని కోరారు.